టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే సాధారణ ప్రేక్షకులలే కాదు ఇండ్రస్టీలో చాలా మంది డైరెక్టర్స్ సైతం ప్రభాస్ అంటే ఎంతో ఇష్టపడతారు.ప్రభాస్ తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని చాలా మంది డైరెక్టర్లు కోరుకుంటారు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క మూవీ కి 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో ప్రభాస్ ఒక్కడే కావడం విశేషం.అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ప్రభాస్ గురించి కొన్ని  ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. వినాయక్, ప్రభాస్ కాంబినేషన్ లో యోగి సినిమా తెరకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా అనుకున్నంత పెద్ద హిట్ కాలేదు.ప్రస్తుతం వినాయక్..యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా నటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వినాయక్  ప్రభాస్ కు నేనంటే చాలా ఇష్టమని ఏ రాత్రి కాల్ చేసిన లిఫ్ట్ చేసి మాట్లాడతారని చెప్పారు.చిరంజీవి తో తనకి మంచి అనుబంధం ఉందని..

అంతేకాకుండా పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా ల కాంబోలో తెరకెక్కుతున్న అయ్యప్పమ్ కొషియమ్ రీమేక్ లో గెస్ట్ రోల్ కూడా చేస్తున్నారని వినాయక్ చెప్పారు.రానా కాంబినేషన్ లో తనకు సీన్స్ ఉంటాయని సినిమాలో కూడా తాను డైరెక్టర్ గా కనిపించనున్నారని వినాయక్ చెప్పుకొచ్చారు.ఈ మధ్య కాలం లో సరైన హిట్లు సాదించలేక పోయిన వినాయక్ ఛత్రపతి రీమేక్ తో సక్సెస్ సాధిస్తారా లేదా చూడాలి..ఇక అటు డైరెక్టర్ గానే కాకుండా త్వరలో హీరోగా కూడా మన ముందుకు రానున్నాడు.శీనయ్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు వినాయక్.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: