దేశంలో మహిళలు ఎన్నో రంగాలలో రాణించి రోజురోజుకు తమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. పిల్లాడికి పాలు ఇచ్చే దగ్గర నుంచి దేశాన్ని పాలించే వరకు అన్ని రకాల రంగాలలో స్త్రీలు లేని రంగం లేదు. వారి హస్తం లేని కంపెనీ లేదు. మన మహిళలు తమ సత్తా చాటుతూ దేశానికి సేవ చేయడంలో ముందుంటున్నారు. దేశంలో ఎన్నో గర్వించదగ్గ మెడల్స్ అందుకున్న మిథాలి మధుమిత  గురించి తప్పకుండా ఈరోజు మాట్లాడుకోవాలి. ఆమె సాధించిన ఘనతలు భారత దేశంలో ఎంతో మంది స్పూర్తిగా నిలుస్తున్నాయి. ఆమె వీరోచిత ఘటనలు అందరిని ఒళ్ళు గగుర్పోడుస్తాయి. 

ఆమె సాధించిన ఘనతలు ఎందరో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్యలెంట్రీ అవార్డును అందుకున్న మొదటి మహిళ ఆర్మీ ఆఫీసర్ గా ఆమె చరిత్ర సృష్టించింది ఇండియన్ ఆర్మీ లో.  లెఫ్టినెంట్ కల్నల్ మధుమిత 2011లోనే ఆమె చూపించిన వీరోచిత పోరాటానికి గాను సేన మెడల్ గెలుచుకుంది. ఆఫ్ఘన్ లోని కాబూల్ ఇండియా ఎంబసీ లో జరిపిన కాల్పుల్లో ఆమె చూపించిన సాహసానికి ఈ మెడల్ అందించారు. 2010లో ఫిబ్రవరిలో ఈ సంఘటన జరగగా అక్కడ కొంతమంది ఆర్మీ ప్రముఖులతోపాటు లోకల్ ప్రజలను కూడా కాపాడింది.

 2000 సంవత్సరంలో ఆర్మీలో జాయిన్ అయినా మధుమిత ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో అనర్గళంగా మాట్లాడగలదు. 22 సంవత్సరాలుగా ఆమె చేసిన సేవలకు భారత ప్రభుత్వం గ్యలెంటరీ అవార్డును అందించింది. ఇప్పుడు ఆఫ్ఘన్ లో నెలకొన్న పరిస్థితుల రీత్యా అక్కడ ఉగ్ర దాడి నుంచి 19 మంది ప్రాణాలను కాపాడినందుకు ఈమెకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళా ఆఫీసర్ గా దేశం లోనే  ఈమె రికార్డు సృష్టించింది. అంతకుముందు చాలా ఉగ్రదాడుల నుంచి భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: