టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ భరత్ అనే నేను మూడేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది యువ బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఫస్ట్ మూవీ తోనే ఇక్కడ సూపర్ సక్సెస్ అందుకున్న కియారా, అంతకముందు బాలీవుడ్ లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా రూపొందిన ఎమ్ ఎస్ ధోనిలో ఒక హీరోయిన్ గా నటించి మంచి పేరు అందుకున్నారు.

అయితే తెలుగులో ఆమె నటించిన సెకండ్ మూవీ వినయ విధేయ రామ. రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తరువాత నుండి పూర్తిగా హిందీకే పరిమితం అయిన కియారా ప్రస్తుతం బాలీవుడ్ లో నటించిన లేటెస్ట్ సినిమా షేర్షా. సిద్దార్ధ మల్హోత్రా హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోగ్రఫికల్ వార్ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒటిటి ద్వారా విడుదలై సూపర్ హిట్ టాక్ తో పాటు విమర్శకుల నుండి సైతం ప్రసంసలు అందుకుంది. అయితే ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు ఈ మూవీ ఎంతో బాగుందని ప్రశంసిస్తుండగా, కొద్దిసేపటి క్రితం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్షా టీమ్ పై పొగడ్తలు కురిపించారు.
షేర్షా మూవీ చూసాను, దర్శకుడు విష్ణువర్ధన్ ఎంతో హార్ట్ టచింగ్ గా ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా హీరో సిద్దార్ధ తన కెరీర్ లోనే ఈ సినిమా లోని పాత్ర ద్వారా బెస్ట్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. హీరోయిన్ కియారా అద్వానీ తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. అలానే ఈ మూవీకి పని చేసిన టెక్నీకల్ టీమ్ కి దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నిర్మాత కరణ్ జోహార్ కి, ఇలా అందరికి మూవీ సక్సెస్ పై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అల్లు అర్జున్. కాగా ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి