నటి పూజా హెగ్డే తెలుగులో తొలిసారిగా నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం మూవీలో యాక్ట్ చేసారు. విజయ్ కుమార్ కొండా తీసిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుని ఆమెకు బాగానే పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆపైన కెరీర్ పరంగా కొన్నేళ్లు సరైన సక్సెస్ కోసం ఎదురు చూసిన పూజా హెగ్డేకి తరువాత అల్లు అర్జున్ తో చేసిన డీజే మూవీ ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందించింది. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన నటించిన అరవింద సమేత మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆమెకు మంచి బ్రేక్ నిచ్చింది.

అనంతరం మహేష్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్, అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో మూవీస్ పూజ హెగ్డే కి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ ని అందించాయి. వాటితో హీరోయిన్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తమిళ యాక్టర్ విజయ్ తో బీస్ట్, మరొకసారి మహేష్ తో తదుపరి సినిమా, ఇలా వరుసగా పలు ప్రాజక్ట్స్ లో నటిస్తోంది. అయితే నటిగా తనతో డీజే మూవీ నుండి నేడు విజయ్ తో చేస్తున్న బీస్ట్ మూవీ వరకు తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన పర్సనల్ టీమ్ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ ఒక ఇంగ్లీష్ సాంగ్ ద్వారా సరదాగా వారందరినీ పరిచయం చేస్తూ పూజా హెగ్డే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

నా టీమ్ మెంబర్స్ కి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, అలానే నా ఈ సినిమా ప్రయాణంలో నన్ను ఎంతో అభిమానిస్తూ ఆదరిస్తున్న ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ థాంక్స్ అంటూ పూజా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఆమె రాబోయే రోజుల్లో తప్పకుండా మరిన్ని గొప్ప సక్సెస్ లు అందుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని పూజా హెగ్డే ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: