టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్ళీ కుదిపేస్తోంది. ఇప్పటివరకు విచారణకు హాజరు అయిన సెలిబ్రెటీలు తమ ఆర్థిక లావా దేవీలకు సంబంధించిన వివరాలను ఈడీకి అందించారని తెలుస్తోంది. డ్రగ్ పెడ్లర్లతో ఆర్థిక లావాదేవీలు మనీ ల్యాండరింగ్ వంటి అంశాలు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. సెలబ్రెటీల ద్వారా డబ్బు ఎలా విదేశాలకు వెళ్ళింది అన్న కోణంలో ఇప్పుడు ఈ కేసు విచారణ జరుగుతోంది అని తెలుస్తోంది.


ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈవ్యహారంలో ఎవరో ఒకరు బుక్ అవ్వడం ఖాయం అంటున్నారు. ఈపరిస్థితి ఇలా కొనసాగుతూ ఉండగానే ‘మా’ సంస్థ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈనేపధ్యంలో మా సంస్థ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ చర్చలు జరుగుతున్నాయి. డ్రగ్స్ పుచ్చుకునేవాళ్లు అదేవిధంగా విక్రయించేవాళ్లు కూడ దేశద్రోహులని అభిప్రాయపడ్డాడు. యువతను చెడు మార్గం పట్టించడమే కాకుండా దీనివల్ల యువత నాశనం అవుతుందని ప్రకాష్ రాజ్ కామెంట్ చేసాడు.


అంతేకాదు డ్రగ్స్ వాడేది ఎవరైనా తాను తప్పు పడతానని ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఈవ్యవహారంలో ఇరుకున్న సెలెబ్రెటీ లను పరోక్షంగా ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తున్నాడా అన్నసందేహం కలుగుతుంది. మెగా ఫ్యామిలీ అండదండలతో ఈసారి ప్రకాష్ రాజ్ గెలుపు ఖాయం అంటూ కొందరు భావిస్తూ ఉంటే కృష్ణంరాజు బాలకృష్ణ అండదండలతో మంచు విష్ణు సైలెంట్ విన్నర్ గా మారుతాడని మరికొందరు అంటున్నారు.


ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ప్రకాష్ రాజ్ మంచు విష్ణులు పోటాపోటీగా ఏర్పాటు చేస్తున్న వీకెండ్ పార్టీలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించలేకపోయిన ప్రకాష్ రాజ్ తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈసారి మా సంస్థ ఎన్నికలను చాల సీరియస్ గా తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. జాతీయ స్థాయి ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో మీడియాతో పాటు సాధారణ ప్రజలు కూడ ఈఎన్నికల పై చాల ఆశక్తి కనపరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: