
అమల తల్లిదండ్రులది భారతీయ మూలం కాదని మీకు తెలుసా? అవును! అమల తల్లి ఐర్లాండ్‌కు చెందినది కాగా, ఆమె తండ్రి బంగ్లాదేశ్‌కు చెందినవారు. పెళ్లి తర్వాత ఇద్దరూ చెన్నైలో స్థిరపడ్డారు. తరువాత వారికి అమల జన్మించింది.
యాక్టింగ్ కెరీర్
1984 లో టి రాజేందర్ దర్శకత్వం వహించిన "మైథిలి" అనే సినిమా తో అమల వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సినిమాను తీయాలన్న సమయంలో చిత్ర నిర్మాత ఒక నర్తకి కోసం చూస్తున్నాడు. అమల శాస్త్రీయ నృత్యకారుల సర్కిల్‌లో అప్పట్లో పాపులర్. అందుకే ఆ పాత్ర అమలకు దక్కింది. విజయవంతమైన నటిగానే కాకుండా అమల అక్కినేని శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్. ప్రముఖ కళాకారిణి రుఖ్మిణీ దేవి అరుంగల్ దగ్గర శిక్షణ పొందిన అమల 13 ఏళ్ళ వయసులో భారతదేశం తో పాటు విదేశాలలో కూడా పలు స్టేజ్ షోలు చేసింది.
పెండ్లి
అమల, అక్కినేని నాగార్జున 1992 లో విడుదలైన "కిరాయి దాదా" సెట్స్‌లో కలుసుకున్నారు. కొంత కాలం తర్వాత నాగార్జున ఆమెను వివాహం చేసుకుంటానని అడిగారు. 1992 లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అమల, నాగార్జునలకు అఖిల్ అనే కుమారుడు ఉన్నాడు.
జంతు ప్రేమికుడు
సినిమాలను వదిలేసిన తరువాత అమల తన భర్త సహాయంతో "బ్లూ క్రాస్" అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ 4,00,000 జంతువులకు నిలయంగా ఉంది. అమల జంతువులను రక్షించడానికి చేసిన ప్రయత్నం పెటా ద్వారా గుర్తింపు పొందింది. జంతు సంరక్షణలో రక్షించడంలో పెటా కూడా సహాయపడింది.