సాధారణంగా సినిమాలు అంటే హిట్లు మరియు ప్లాపులు సహజంగా ఉంటాయి. అయితే హీరోలు మాత్రం హిట్స్ రావాలని సక్సెస్ అందుకోవాలని అనుకుంటూ ఉంటారని తెలుస్తుంది. అయితే ఎప్పటి నుండో హిట్లు కొట్ట లేని హీరోలు ఈసారి హిట్స్ అందుకున్నారు అని తెలుస్తుంది.

అయితే పలు హీరోలు తిరిగి ఫామ్ లోకి వచ్చారని సమాచారం. అయితే మరి ఈ సంవత్సరం మంచి కంబ్యాక్ ఇచ్చిన హీరోల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఈ సంవత్సరం హీరో గోపీచంద్ కి మంచి విజయం వచ్చిందని చెప్పవచ్చు. సిటీమార్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుందని తెలుస్తుంది ఈ మూవీ. అయితే గత నాలుగు సినిమాలు కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయని సమాచారం. గౌతమ్ నంద మరియు పంతం, చాణక్య అలాగే ఆక్సిజన్ వంటి సినిమాలు తో గోపీచంద్ వచ్చినా సరే అవి ఆకట్టుకోలేక పోయాయని తెలుస్తుంది. కానీ ఈసారి మాత్రం సిటీ మార్ సినిమా తో గోపీచంద్ మంచి కం బ్యాక్  ఇచ్చాడని  చెప్పొచ్చు.

2021 సంవత్సరం గోపీచంద్ కి బాగా కలిసి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం గోపీచంద్ మాత్రమే కాకుండా మరో ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఫామ్ లోకి వచ్చారని సమాచారం.ఇక మనం వాళ్ల గురించి కూడా తెలుసుకుందాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని సమాచారం.కరోనా సమయంలో వచ్చినా కూడా ఈ సినిమా విజయవంతం సాధించిందని తెలుస్తుంది. అదే విధంగా అల్లరి నరేష్ కూడా మంచి కం బ్యాక్ ఇచ్చాడని సమాచారం.అల్లరి నరేష్ నాంది సినిమా తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడట అల్లరి నరేష్. అదే విధంగా క్రాక్ సినిమాతో మాస్ మహారాజా రవితేజ కూడా మంచి విజయాన్ని ని అందుకున్నాడని సమాచారం. వరుస ప్లాప్ లతో విసిగిపోయిన మాస్ మహారాజ ఈ  సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.ఇలా ఈ ఏడాది ఈ హీరోలకి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: