తాజా మా ఎన్నిక‌ల వేళ టాలీవుడ్ ఎలా రెండుగా చీలిపోయిందో మ‌నం చూశాం. మా రెండు గా చీలిపోవ‌డంతో ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోలు, ఇత‌రులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఎవ‌రికి వారు త‌మ అవ‌స‌రాల నేప‌థ్యంలో , మొహ‌మాటాలు, ఇత‌ర బంధుత్వాలు, స్నేహాల నేప‌థ్యంలో ఏదో ఒక వ‌ర్గానికి త‌ప్ప‌ని స‌రిగా కొమ్ము కాయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఇది గ‌తంలో లా ఎన్నిక‌లు ముగిసేంత వ‌ర‌కే ఉంటే బాగానే ఉండేది. అయితే తాజా మా ఎన్నిక‌లు గ‌త ఎన్నిక‌ల‌కు భిన్నంగా జ‌రిగాయి. సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తూ మ‌న సినిమా న‌టులు ఒక‌రిపై మ‌రోక‌రు తీవ్రంగా దుమ్మెత్తి పోసుకున్నారు.

ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ముగిశాక కూడా వీరంతా క‌ల‌సి ప‌ని  చేస్తార‌నే అంద‌రం అనుకున్నాం. ప్ర‌కాష్ రాజ్ ఫ్యానెల్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తాము మంచు విష్ణు వ‌ర్గంలో క‌లిసి ప‌ని చేసే ప్ర‌శ‌క్తే లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇక ఆయ‌న ఫ్యానె ల్లో గెలిచిన 11 మంది కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇది సినిమా ఇండ‌స్ట్రీలో ఓ అనైతిక వాతావ‌ర‌ణానికి దారి తీసిన‌ట్ల‌య్యింది.

రేపు ఈ రెండు ఫ్యానెల్స్ లో ఒక ఫ్యానెల్ వారు న‌టించే సినిమాల్లో మ‌రోక‌రు న‌టించే ఛాన్స్ ఉండ‌దు. ఎందుకంటే వారు ఖచ్చితంగా త‌మ సినిమాల్లో అవ‌త‌లి ఫ్యానెల్ వారిని క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు లు గానో లేదా ఇత‌ర పాత్ర‌ల కోస‌మే తీసుకుంటే ఒప్పుకోర‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఎంతో మంది యువ‌న‌టులు కూడా ఈ సారి ఎన్నిక‌ల రంగంలోకి దిగారు. రేపు వారికి అవ‌కాశాలు వ‌చ్చే క్ర‌మంలో అవ‌త‌లి ఫ్యానెల్ వారు ఛాన్సులు రానిస్తారా ? ఇది కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కు కాకుండా వారి జీవితా ల‌పై కూడా ప్ర‌భావం చూప‌నుందా ?  ఇవే ఆందోళ‌న‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మ‌రి దీనికి కాల‌మే ఆన్స‌ర్ చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: