నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే తాను నటించిన  వి, టక్ జగదీష్ సినిమాలను ఓటిటి లో విడుదల చేసిన  ఈ హీరో తన తదుపరి చిత్రం అయిన శ్యామ్ సింగరాయ్ ను థియేటర్ల లో విడుదల చేయబోతున్నట్లు తాజా గా కన్ఫర్మ్ చేశాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ను చిత్రబృందం తాజా గా విడుదల చేసింది. శ్యామ్ సింగ రాయ్'' సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు హీరో నాని ప్రకటించారు.

 అంతేకాదు పాన్ సౌత్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందం వదిలిన పోస్టర్ జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. శ్యామ్ సింఘ రాయ్' నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ. సత్యదేవ్ జంగా ఈ సినిమాకు కథను అందించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాకు సాను జాన్ వర్గేష్ సినిమాటో గ్రఫీ  చేస్తున్నారు. ఈ సినిమాలో జిషు సేన్ గుప్తా - రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం - లీలా శాంసన్ - మనీష్ వాద్వా - బారున్ చందా తదితరులు ఇతర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కీలక  మరి ఈ సినిమా తో నాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వర కు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: