సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు కి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా బస్ కండక్టర్ స్థాయి నుంచి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజనీకాంత్ జీవితం నేటి రోజుల్లో యువతకి ఎంతగానో ఆదర్శం అని చెప్పాలి. రజనీకాంత్ ఒక తమిళ నటుడు అయినప్పటికీ ఆయనకు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషలలో కూడా అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. రజినీకాంత్ ఏదైనా సినిమాలో నటించాడు అంటే చాలు ఇక దేశవ్యాప్తంగా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసే అభిమానులు కోట్ల లోనే ఉన్నారు.


 అందుకే చిత్ర పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ యువ హీరోలు రజనీకాంత్ స్టార్ డమ్ సంపాదించుకోలేక పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు ఓ వైపు ఏజ్ పెరిగిపోతున్నప్పటికి ఇంకా సినిమాల్లో అదే ఎనర్జీతో నటిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు రజినీకాంత్. ఏ సినిమాలో నటించిన ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్తయ్ సినిమాలో నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే సినిమాలో సీనియర్ నటి కుష్బూ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ఇటీవలే రజినీకాంత్ ఎనర్జీ గురించి ప్రవర్తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది  ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ ఎనర్జీ ఎంత మాత్రం తగ్గలేదు అంటూ చెప్పుకొచ్చింది. 1990 దశకంలో అరుణాచలం, అన్నమలై, పడేయప్ప వంటి చిత్రాలలో నటించినప్పుడు రజనీ లో ఉన్న అదే ఎనర్జీ ఇక ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సినిమా షూటింగ్ సమయంలో కూడా గమనించాను. ఆయన ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు అంటూ తెలిపింది. అంతే కాదు ఆయన ప్రస్తుతం పెద్ద సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ ఒకప్పుడు షూటింగ్ కి ఆలస్యంగా వస్తే సారీ చెప్పేవారు. ఇక ఇప్పుడు కూడా అలాగే షూటింగు ఆలస్యం అయితే సారీ చెపుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ హీరోయిన్ ఖుష్బూ.

మరింత సమాచారం తెలుసుకోండి: