టాలీవుడ్ లో వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాల పోటీలు చాలా గట్టిగా ఉండబోతున్నాయా? అంటే ఇప్పటి పరిస్థితులు చూస్తే అలానే కనిపిస్తోంది. సంక్రాంతి రేసులో అగ్రహీరోల సినిమాలు విడుదలకు పోటీపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న త్రిబుల్ ఆర్ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. చివరగా జనవరి 7న 2022 కి ఫిక్స్ అయింది. కానీ అప్పటికే సంక్రాంతి రేసులో మూడు సినిమాలు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. దీంతో సంక్రాంతి పోరు ఎంతో ఆసక్తిగా మారింది. గతంలోనూ సంక్రాంతికి ఒకటికి మించిన సినిమాలు చాలానే వచ్చాయి. అయితే త్రిబుల్ ఆర్ తో మాత్రం అలా ఉండదు.

 ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు  దాదాపు 450 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. మళ్లీ అంత బడ్జెట్ రావాలంటే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కనీసం రెండు వారాలు ఈ సినిమా ఆడాలి. లేకుంటే నిర్మాతకు నిర్మాతలకు చాలా నష్టం కలుగుతుంది. దానిద్వారా ఇండస్ట్రీ కూడా నష్టమే. ఆ లెక్కన ఒకసారి చూసుకుంటే.. జనవరి 7న త్రిబుల్ ఆర్ వస్తుంది ఆ తర్వాత ఐదు రోజులకే 'భీమ్లా నాయక్' వస్తున్నాడు ఇక ఆ మరుసటి రోజే 'సర్కారు వారి పాట' తో మహేష్ బాబు రంగంలోకి దిగుతున్నాడు  ఇక ఆ నెక్స్ట్ డే ప్రభాస్ 'రాధేశ్యామ్' విడుదలవుతుంది. ఇక రాధేశ్యామ్ కూడా పాన్ ఇండియా సినిమానే. 

మరోవైపు అటు పవన్, మహేష్ ల సినిమాలు, అవి సృష్టించే రికార్డుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇక త్రిబుల్ ఆర్ కంటే ప్రభాస్ కే పాన్ ఇండియా ఇమేజ్ ఎక్కువ. దీంతో ఈ నాలుగు సినిమాల మధ్య టాలీవుడ్ సంక్రాంతికి నలిగిపోవడం ఖాయం. అయితే ఈ రేసు నుంచి ఎవరు తప్పుకుంటారు అనే అంశం కూడా ఆసక్తిగా మారింది. ఆఖరికి ముందుగా రేస్ లోకి వచ్చిన త్రిబుల్ ఆర్ యే వెనక్కి వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటూ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి వెనకబడే ఉన్నారు. దీంతో జక్కన్న ఈ సారి కూడా రిలీజ్ డేట్ మారుస్తారా? అనే ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ 'ఆర్ ఆర్ ఆర్' సమ్మర్ కే వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే త్రిబుల్ ఆర్ కి పవన్, మహేష్ లు దారి ఇస్తారేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR