సంక్రాంతి సీజన్ టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే అతి పెద్ద సీజన్ గా మారబోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా ఏకంగా నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు ఈ సీజన్ లో రానున్నాయి. మొదటగా జనవరి 7వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతున్నట్లు ప్రకటించడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే రాజమౌళి ఏ విధమైన ఆలోచన తో జనవరి 7వ తేదీన ఎంచుకున్నాడో తెలియదు కానీ రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఇతర సినిమాలకు చాలా కష్టంగా మారింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఇంకా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వాలని ఇప్పటికే తేదీలను కూడా ప్రకటించుకున్నాయి. అయితే అనూహ్యంగా వారికి రాజమౌళి పోటీ రావడం వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టే అంశంగా మారింది. 

భీమ్లా నాయక్ సినిమా జనవరి 12 వ తేదీన విడుదల కాబోతు ఉండగా రాధేశ్యామ్ జనవరి 14 వ తేదీన రాబోతుంది. అలాగే మహేష్ సర్కార్ వారి పాట జనవరి 13వ తేదీన రాబోతుంది. ఈ నేపథ్యంలో జనవరి 7వ తేదీ కి 12వ తేదీ కి కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఇంత తక్కువ గ్యాప్ లో ఈ సినిమాలు ఎవరికి వారు తగ్గేదేలే అనుకుంటూ విడుదల ను పోస్ట్ ఫోన్ చేయకుండా ఉంచుతున్నాయి. దాంతో ఈ సినిమాలు ఒకేసారి విడుదల అయితే తప్పకుండా అన్ని సినిమాలకు కాకపోయినా కొన్ని సినిమాకైనా నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలలో ఎక్కువగా నష్టపోయే సినిమా ఎదై ఉంటుందో  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: