టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి కనుమరుగైన క్రేజీ హీరోయిన్లలో ఆసిన్ కూడా ఒకరు. కేరళ ముద్దుగుమ్మ ఆసిన్, సూర్య హీరోగా తెరకెక్కిన సినిమా "గజిని" ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తర్వాత "అమ్మనాన్న ఓ తమిళమ్మాయి","శివమణి", "లక్ష్మి నరసింహ", "ఘర్షణ" వంటి చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఈమె మల్టీ టాలెంటెడ్ గొప్ప నటే కాదు, భరత నాట్యంలో సుప్రసిద్ధురాలు , అంతేకాదు ఎనిమిది భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. కెరియర్ మంచి స్పీడ్ లో ఉన్న సమయంలోనే ఈమె చేసిన ఒక చిన్న పొరపాటు వలన ఇండస్ట్రీకి దూరమయ్యిందని చాలా కథనాలు వినిపించాయి.

ఇంతకీ అదేంటంటే..!! ముంబైకి సంబంధించినటువంటి సెలబ్రెటీ మేనేజ్మెంట్ కంపెనీలో చేరి పదికోట్ల కోసం ఓ ఏడాది పాటు ఆ కంపెనీ లో ఉండాలని డీల్ ను కుదుర్చుకుందట. దాంతో మెల్లగా ఓ సంవత్సరం పాటు ఇండస్ట్రీతో పెద్దగా టచ్ లో లేకపోవడంతో అవకాశాలు తగ్గాయని అని చెబుతుంటారు. స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘ కాలం రాణించే అందం, ప్రతిభ ఉన్న ఆసిన్ కేవలం పదికోట్ల కోసం కెరియర్ నాశనం చేసుకుందని చాలా వార్తలే వినిపించాయి. అనంతరం 2016 లో   రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు బాయ్ బాయ్ చెప్పేసింది ఈ అందాల తార.

రాహుల్ మైక్రోమ్యాక్స్ సంస్థకు కో ఓనర్ గా ఉన్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. సినిమాలకు దూరమైన ఆసిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ చాలా సార్లు వార్తలు వినిపించినా అవేమీ జరగలేదు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఎపుడు ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటారు ఆసిన్. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ తెలియచేస్తున్నారు ఫ్యాన్స్ మరియు పలువురు సినీ ప్రముఖులు.

మరింత సమాచారం తెలుసుకోండి: