నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తుంటాయి. ఆయన ఏం చేసినా అది ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. వెండితెరపై మాస్ డైలాగ్ లు, యాక్షన్, డాన్స్ ఇలా అన్నింటిలో దుమ్ములేపే బాలయ్య కాస్త రూటు మార్చి సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ బాట పట్టాడు. తొలి తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' కోసం బాలయ్య ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. కెరీర్లో మొట్టమొదటిసారి బాలయ్య బుల్లితెరపై కనువిందు చేయబోతుండడంతో ఈ ప్రతి ఒక్కరికి ఈ షో పై ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే అందుకు తగ్గట్లే..

 ఈ టాక్ షో ఉండబోతోందని తాజాగా ఓ చిన్న ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు ఆహా నిర్వాహకులు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్.బి.కె' షో కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.." మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై అంటే సై.. నై అంటే నై.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా" అంటూ బాలయ్య చెప్పే డైలాగులు ఈ ప్రోమో ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళి పోయాయి. వీటితో పాటు ముఖ్యంగా ఈ ప్రోమో లో బాలయ్య ఎనర్జీ' స్టైల్, విజువల్స్ అయితే వర్ణనాతీతం. ఇక ముఖ్యంగా ప్రోమో చివర్లో "వన్స్ ఐ స్టెపిన్ హిస్టరీ రిపీట్స్" అని చెప్పే డైలాగ్ అయితే అభిమానులతో పాటు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

దీంతో ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేసేస్తోంది. ఓ సినిమాకు వచ్చిన హైప్ బాలయ్య టాక్ షో కి రావడమంటే మామూలు విషయం కాదు. జస్ట్ ప్రోమోనే ఇలా ఉంటే.. ఇక ఫుల్ టాక్ షో ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ముఖ్యంగా బాలయ్య అభిమానులు అయితే ఈ ప్రోమో చూసి పండగ చేసుకుంటున్నారు. నవంబర్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. బాలయ్య దిగనంతవరకే ఒక్కసారి ఆయన అడుగు పెడితే రికార్డులు బద్దలు అవ్వాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: