తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ ట్రెండింగ్ తెలుగు పాట "నక్కిలీసు గొలుసు". 'పలాస 1978' చిత్రంలోని ఈ పాటను 2020 మార్చి 21న ఆన్‌లైన్‌లో విడుదల చేయగా ఇప్పటికీ భారీ సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది ఈ సాంగ్. 2020లో మంచి జనాదరణ పొందిన మాస్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి. ఈ సాంగ్ గ్రామీణ సాహిత్యం, అద్భుతమైన ట్యూన్‌లతో కూడిన పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో 11 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.

మూడు నిమిషాల 56 సెకన్ల ఉల్లాసకరమైన పాట రక్షిత్, నక్షత్రలపై చిత్రీకరించబడింది. రఘు కుంచె ఈ పెప్పీ సాంగ్ కు ట్యూన్‌కి కంపోజర్‌, అలాగే సింగర్‌ కూడా. ఈ సాంగ్ వచ్చాక అనేక ఫ్యాన్-కట్ వీడియోలు, పాట dj రీమిక్స్‌లు ఇప్పటికీ పెళ్లిళ్లు, పండగలకు విన్పిస్తూనే ఉంటాయి. అన్ని వయసుల వారు ఈ ఫోక్ సాంగ్ ను ఆస్వాదిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వివాహాలు, పార్టీలు, ఈవెంట్‌లకు ఒక స్పెషల్ సాంగ్ గా మారిం.  

'నక్కిలీసు గొలుసు' సాంగ్ అంతగా ఆకట్టుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుండి 50 ఏళ్ల నాటి ప్రసిద్ధ జానపద పాట నుండి ఈ సాంగ్ ను రీమేక్ చేశారు. హిప్ బీట్‌లతో ఉన్నప్పటికీ, ఒరిజినల్ గ్రామీణ సాంగ్ ను కొత్త వెర్షన్‌లో అలాగే ఉంచారు. అసలు పాట నుండి ఒరిజినల్ సాహిత్యం స్థానిక సంస్కృతిలో పాతుకుపోయింది. రఘు స్వరం ఈ పాటకు హైలెట్.

ఇనక ఈ పాటలో ఉన్న మాస్ బీట్ , అద్భుతమైన చిత్రీకరణ, దాని పెప్పీ ట్యూన్‌లకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ పాటకు ప్రత్యేకంగా అభిమానులు లేరు. ఎందుకంటే ఈ మాస్ సాంగ్ ను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. రఘు 'నక్కిలీసు గొలుసు' సాంగ్ కోసం తన గాత్రాన్ని అందించాడు. అలాగే సమకాలీన సంగీతంతో ఆధునిక టచ్‌ని ఇచ్చాడు. రీక్రియేట్ చేయడానికి ఒక్క రోజు మాత్రమే తీసుకున్న ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్‌తో థ్రిల్ అయ్యానని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: