
పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. వాటిలో ముందుగా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయిత కాగా రానా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నిలిపాయి.
ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ను ఈ చిత్ర యూనిట్ కూడా వ్యక్తపరుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న ఎక్కడ పోటీ వస్తుందేమోనన్న భయం మొదట్లో నెలకొనగ ఇప్పుడు అదే నిజం అయ్యింది. జనవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా భీమ్లా నాయక్ సినిమా ఎప్పుడు విడుదల చేయాలన్న సందిగ్ధంలో పడిపోయింది.
వాస్తవానికి రాజమౌళి నిర్ణయం సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాలకు అన్నిటికీ కూడా పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. ప్రభాస్ మహేష్ వంటి హీరోలు ఉన్నా ఏమాత్రం జాలి లేని విధంగా రాజమౌళి విడుదల చేస్తున్నాడు .ఇప్పుడు ఆయా సినిమా లు పోస్ట్ ఫోన్ చేయాలా లేదా అన్న ఆలోచనలో పడ్డాయి. మరో వైపు పవన్ అభిమానులు భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతి కి విడుదల చేయకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. సినిమా ఉంటుందని ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు కూడా అదే ఆలోచిస్తోందట దాంతో ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నారు మరి లేదా అదే సమయానికి విడుదల చేస్తాడు అనేది చూడాలి.