సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ మూడు గంటల సేపు వారిని మైమరిపిస్తూ ఏమాత్రం బోర్ కొట్టకుండా ఆనందంగా వీక్షించగలిగేలా చేయాలి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా హాల్ కి వచ్చినవారిని సంతృప్తిగా తిరిగి పంపించగలగాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎంటర్టైన్మెంట్ తో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాలను సాదరంగా అందించడం మరో ఎత్తు. అదేనండి యాక్షన్ చిత్రాలు, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు, కామెడీ చిత్రాలు వంటివి ఎన్నో వస్తుంటాయి. కానీ సందేశాత్మక చిత్రాలు మాత్రం కొన్ని మాత్రమే రూపుదిద్దుకుంటాయి. దీనికి కారణం సందేశాలను చాలా సృజనాత్మకంగా చిత్రీకరించి కథలో మిగిలిన ఎలిమెంట్స్ ని కూడా జొప్పించాల్సి ఉంటుంది.

అందులోనూ చాలా జాగ్రత్తగా అనుకున్న సందేశాలను అదే అర్దంతో ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చూడాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇక ఆ సినిమాను ప్రేక్షకులు నచ్చే విధంగా రూపుదిద్దాలి. అందుకే  చాలా మంది సందేశాత్మక చిత్రాలు జోలికి అస్సలు వెళ్లరు. మిగిలిన జోనర్స్ లో వారు నిష్ణాతులైన వాటిని ఎంచుకొని  ముందుకు వెళుతుంటారు. ఇంకొందరు మాత్రం ఏది ఏమైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇవ్వాలి అని నిర్ణయించుకుని సాహసం చేస్తుంటారు. అలా వచ్చిన చాలా చిత్రాలు ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్స్ ను అందించగా కొన్ని సినిమాలు మాత్రం పాయింట్స్ బాగున్నా ఆడియన్స్ కి రీచ్ కాక నిరాశను మిగిల్చాయి.

అదే విధంగా  బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ విమర్శకుల ప్రసంశలు మాత్రం కోకొల్లలుగా అందుకున్న సందేశాత్మక చిత్రాలు సైతం ఉన్నాయి. ఇపుడు సమాజానికి ఎంతగానో ఉపయోగపడే సందేశాలను అందిస్తూనే ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ గా అందించి సూపర్ హిట్ అయిన చిత్రాలను చూద్దాం. వాటిలో చిరు నటించిన ఠాగూర్, స్టాలిన్ లు ముందు వరుసలో ఉంటాయి. ఇంకా చూసుకుంటే అపరిచితుడు, ఆపరేషన్ దుర్యోధన, ప్రతినిధి లాంటి  ఎన్నో చిత్రాలు ప్రజలను మార్చిన సందర్భాలు ఉన్నాయి. సినిమా వలన మారిన ఎందరో మనుషులు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: