అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా చైతూ సినిమా చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో నాగచైతన్య కు సంబంధించి ఒక రూమర్ చర్చనీయాంశంగా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. చైతూకి సమంత తో పరిచయం ఏర్పడక ముందు ఒక స్టార్ హిరోయిన్ నాగ చైతన్య ని ప్రేమించిందట. అంతేకాదు చైతూ కూడా ఆమెను పీకల్లోతు వరకు ప్రేమించినట్టు సమాచారం. ఆ స్టార్ హీరోయిన్ ని చైతు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కానీ ఏమైందో తెలియదు గానీ వారిద్దరు విడిపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేదేగా మీ డౌట్?

 ఆమె మరెవరో కాదు విశ్వనటుడు కమల్హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్. సమంత కంటే ముందు నాగచైతన్య శృతి హాసన్ తో రిలేషన్ లో ఉన్నాడని సమాచారం. 2013వ సంవత్సరంలో చైతు శృతిహాసన్ ఇద్దరూ కలిశారని అక్కడే వారి పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం కాస్తా ప్రేమించుకోవడం వరకు వెళ్లి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. అంతేకాదు వీరిద్దరూ ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరు ఉండలేరని, అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఉన్నట్టుండి వీరు విడిపోవడానికి కారణం ఏంటంటే.. 

ఏదో ఒక అవార్డు ఫంక్షన్ కి శృతిహాసన్ నాగచైతన్య తో పాటు ఆమె చెల్లెలు అక్షర హాసన్ కూడా వెళ్లిందట. అయితే ఆ అవార్డ్ ఫంక్షన్ లో శృతిహాసన్ డ్యాన్స్ చేయవలసి ఉండగా.. తను వచ్చే వరకూ తన చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని తిరిగి వెళ్లేటప్పుడు తన చెల్లిని అప్పగించమని నాగచైతన్యకు చెప్పిందట. కానీ నాగచైతన్య మాత్రం తన చెల్లెలిని అప్పగించకుండానే వెళ్ళిపోయాడట. అయితే ఈ కోపంతోనే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతతో కూడా చైతు విడిపోయాడు. ఇప్పుడు తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: