రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వ ఆన్‌లైన్ టికెటింగ్‌ విధానంపై మరియు టికెట్ల ధరలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు టాలీవుడ్ నుండి పెద్దగా స్పందన రాలేదని తెలుస్తుంది 

ఒకరిద్దరు మినహా పవన్ కల్యాణ్‌ నిర్ణయానికి సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రాలేదని సమాచారం.. ఒకవేళ వస్తే.. క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్‌కే పోతుందని అనుకున్నారో లేక మనకెందుకులే అని అనుకున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌కి పెద్ద డ్యామేజీనే జరిగిందని తెలుస్తుంది.. బుధవారం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లును ప్రవేశ పెట్టిందని తెలుస్తుంది. ఈ బిల్లు ప్రకారం.. ''నో బెనిఫిట్ షోస్ అలాగే నో ఎక్స్‌ట్రా షోస్ అలాగే నో టికెట్ హైక్స్ కేవలం నాలుగంటే నాలుగే ఆటలు మాత్రమే వుంటాయట.టికెట్లను కూడా ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్ముతుందని తెలుస్తుంది... అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీ ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లిపోయినట్లేనని ప్రభుత్వం ఎలా అంటే అలా నడవాల్సిందేనని సమాచారం.

అదే పవన్ కల్యాణ్ అన్నప్పుడు కనుక ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచించి ఉండేవారట. కొంతలో కొంతైనా మార్పు ఉండేదని ఇప్పుడసలు మారు మాట్లాడడానికి లేకుండా చేశారట.. మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలుస్తుంది.. రాష్ట్రంలో అనేక సమస్యలుండగా, నిత్యావసర ధరలు మండిపోతున్న తరుణంలో వాటిపై దృష్టి పెట్టకుండా ఇష్టం ఉంటే కొనుక్కునే సినిమా టికెట్ విషయంలో ఎందుకింత చొరవ చూపిస్తున్నారనే విషయం నిజంగా అంతుబట్టడం లేదంటూ సినీ పెద్దలే కొందరు బాహాటంగా అంటున్నారని సమాచారం.

పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనప్పుడు కేవలం ఏపీలోనే ఎందుకు దీనిని భూతద్ధంలో చూస్తున్నారనేది కూడా అర్థం కావట్లేదట. మంత్రి పేర్ని నాని అయితే ఏపీలో ఏ రంగంలోనూ అన్యాయం జరగడం లేదని. కేవలం సినిమా టికెట్ల విషయంలోనే ప్రజలు నష్టపోతున్నారు అన్నట్లుగా మాట్లాడుతుండటం మరీ విడ్డూరంగా ఉందట.పోనీ సినిమా ఇండస్ట్రీ ఏపీకి రావడం లేదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నార అంటే.. దీనిపై ఇండస్ట్రీ నుండి సానుకూల స్పందనే ఉందని సరైన సౌకర్యాలు కల్పిస్తే కనుక రెండు చోట్ల నుండి పని చేయడానికి మేము సిద్దమే అనేలా సినీ ఇండస్ట్రీ వర్గాలు ఎప్పుడో తెలియజేశాయట.అయినా ఏపీ ప్రభుత్వానికి ఎందుకింత పంతమో అర్థం కాని విషయమని తెలుస్తుంది. కాగా, ఈ బిల్లుపై ఇండస్ట్రీ నుండి ఎటువంటి కదలిక ఉంటుందో తెలియదు కానీ ఈ నిర్ణయంతో థియేటర్ల వ్యవస్థ కుంటుపడి ఓటీటీ సంస్థలు రాజ్యమేలడం మాత్రం ఖాయమని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: