ఉదయ్ కిరణ్ హీరోగా ఆర్తి అగర్వాల్ నటించిన సినిమా నీ స్నేహం. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుకున్నంత పెద్ద  హిట్ కాలేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.  తాజాగా ఈ నిర్మాత ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ లో తను ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ నటించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కూడా ఇంకొక ప్రొడ్యూసర్ ని ఎంకరేజ్ చేయాలని మీ అందరికీ కూడా తెలుసు.

సినిమాలు సరైన సత్తా చూపకపోతే సినిమా పోతుంది అని చెప్పారు ఎం.ఎస్.రాజు. అయితే నేను అందరి లాగా కాదు నా సినిమాతో పాటు వేరే హిట్ సినిమా విడుదలైన కూడా ఆ సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. బన్నీ, మహేష్ లు గతేడాది నటించిన సినిమాలు హిట్ సాధించాలని కూడా చెప్పుకొచ్చారు. అందరి విషయం ఏమో కానీ నా విషయానికొస్తే నిర్మాతలు నాతో బాగానే ఉంటారని చెప్పారు.ఎక్కడో కొందరు అలా ఉంటారు అని చెప్పారు. అయితే తన కెరియర్లో తనతో పనిచేసిన ప్రతి ఒక్కరికి తన న్యాయమే చేశాను అన్యాయం చేయలేదు అంటూ తెలిపారు.

 సినిమాలు చేసే సమయంలో కాంపిటీషన్ బాగా ఉంటుందని ఆ సమయంలో ఏ నిర్మాత కైనా కోపాలు రావడం సహజం అని వెల్లడించారు. అయితే ఈయన తన మొదటి సినిమాలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు తనకి ఎదురుగా లేదని పేర్కొన్నారు. అదే క్రమంలో తను నిర్మాతగా వ్యవహరించిన నీ స్నేహం సినిమా అంత పెద్ద హిట్ అందుకోలేదని ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తో పాటుగా తరుణ్ ఇలాంటి వారిని పెట్టి ఉంటే బాగుండేదేమో నని చెప్పారు. అయితే అయితే హీరో స్నేహితుడి పాత్రలో హీరో స్థాయి ఉన్న వ్యక్తిని పెట్టి సినిమా తీసి ఉంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండేది అని చెప్పుకొచ్చాడు ఎం.ఎస్.రాజు. ఇకపోతే పలు సినిమాలు చేసిన ఈ నిర్మాత డర్టీ హరి సినిమాతో  సక్సెస్ ను సొంతం చేసుకున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: