శ్రీయా శరణ్ కరోనా సమయంలో గర్భందాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆ తర్వాత అన్ని కీలక పాత్రలు ఎంచుకుంటూ ఉండడం గమనార్హం. ఇక పోతే ఈమె పెళ్ళికి ముందు 2001లో ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది . ఇక ప్రస్తుతం ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపుగా 20 సంవత్సరాలు పూర్తి కావస్తోంది.. ఇన్ని సంవత్సరాల పాటు హీరోయిన్ గా కొనసాగాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక శ్రీయ ఈ విషయం లో మాత్రం చాలా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె నటించిన రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


ఒకటి ఈ శుక్రవారం వస్తున్న గమనం సినిమా కాగా.. మరొక సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్.ఆర్.ఆర్.. ఇకపోతే శ్రీయ గమనం సినిమా  ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను మనతో పంచుకుంది.. శ్రీయా మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నందుకు మొదటగా ఆ దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక నా తల్లి ఒక  మాథ్స్ టీచర్ , నాన్న బి హెచ్ ఈ ఎల్ లో పని చేసేవారు. నేను నటించిన మొదటి చిత్రం ఇష్టం .ఇప్పటికీ ఇష్టం సినిమా మీద నా ఇష్టాన్ని కోల్పోలేకపోతున్నాను.

అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేక్షకులు నా పైన పెట్టుకున్న ప్రేమ వల్లే రాణించగలుగుతున్నాను. ఇక సినిమాల పట్ల నా వ్యవహారశైలి కూడా మారింది. ప్రస్తుతం నా కూతురు అలాగే నా కుటుంబ సభ్యులు కూడా నేను చేసే సినిమాలు చూసి గర్వపడేలా ఉండేలా  ప్రతిరోజూ పరితపిస్తూ ఉంటాను.. అంతేకాదు నాకు ఏ పాత్ర అయినా సరే నచ్చితేనే చేస్తాను.. గమనం  సినిమా కథ విన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ..అందుకే ఎలాగైనా సరే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను.


దర్శకురాలు సుజనా రావు ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు అంటూ చెప్పింది. ఆ తర్వాత మహిళలు ఒకప్పుడు చాలా వెనుక ఉండే వారు ఇప్పుడు ముందుకు రాగలుగుతున్నారు.. దానికి కారణం మహిళా దర్శకులు అని చెప్పవచ్చు.. మహిళా దర్శకులతో మనకు ఒకవేళ పీరియడ్స్ వస్తే ఎటువంటి సంకోచం లేకుండా వారికి చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ మేల్ డైరెక్టర్లు ఉన్నారు అనుకోండి అప్పుడు వారితో ఈ సమస్య గురించి చెప్పుకోలేం కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీయ.

మరింత సమాచారం తెలుసుకోండి: