నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రెస్ మీట్ లో అనేక ఆసక్తికర విషయాలు జరిగాయి. తెలుగు మీడియా ముందు మొదటిసారిగా అలియా భట్ రావడంతో కొందరు ఆమెను కార్నర్ చేయాలని ప్రయత్నించారు. ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో అలియా ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన జీవితంలో ‘ఆర్ ఆర్ ఆర్’ కీలకం అంటూ కామెంట్ చేసింది. వాస్తవానికి అలియా మనసులో ‘ఆర్ ఆర్ ఆర్’ అంటే తాను నటిస్తున్న ఈమూవీ కాదు గత కొంత కాలంగా ప్రేమిస్తున్న రణబీర్ కపూర్ అన్న యాంగిల్ లో ఈ కామెంట్స్ చేసింది.
ఈవిషయాన్ని పట్టుకుని బాలీవుడ్ మీడియా ముంబాయ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో అలియా భట్ రణబీర్ ను ఎప్పుడు పెళ్ళి చేసుకుంటున్నావు ఈ పెళ్ళి ముంబాయ్ లో జరుగుతుందా లేదంటే మరెక్కడైనా జరుగుతుందా అంటూ రకరకాల ప్రశ్నలతో అలియాను బాలీవుడ్ మీడియా కార్నర్ చేసింది ఆ ప్రశ్నలకు ఆమె చాల ఇబ్బంది పడింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో జరుగున మీడియా మీట్ లో కూడ అదే ప్రశ్నలు అలియా భట్ కు ఎదురవ్వడంతో ఆమె మళ్ళీ ఇబ్బంది పడింది.
అయితే రాజమౌళి ఈ విషయాలను గమనించి ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి కాకుండా ప్రశ్నలు అన్నీ అలియా భట్ వ్యక్తిగత జీవితం వైపు వెళ్లిపోతు ఉండటంతో ఎలర్ట్ అయిన రాజమౌళి వెంటనే మైక్ ను తీసుకుని ముంబాయ్ మీడియా ప్రశ్నలు అడగకండి అంటూ మీడియా వర్గాలకు చురకలు అంటించాడు. అయితే కాపీ వేరు అనుసరణ వేరు అని తరుచు చెప్పే జక్కన్న బాలీవుడ్ మీడియా ప్రశ్నలను కొద్దిగా మార్చి తెలుగు మీడియా వర్గాలు అడుగుతున్నప్పుడు అడ్డుపడటం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇదే మీడియా మీట్ లో రాజమౌళి మాట్లాడుతూ తమ ‘ఆర్ ఆర్ ఆర్’ టిక్కెట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుంది అని అనడం బట్టి ఈ విషయమై ఇంకా రాయబారాలు జరుగుతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి