లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గొప్పగా ఆదివారం రాత్రి హైదరాబాదులో నిర్వహించారు. అయితే ఈ చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట కు ప్రముఖ ఫోక్ సింగర్ చెల్లెలు ఇంద్రావతి చౌహన్ చక్కటి గానాలాపన చేపట్టారు.

ఈ సినిమాలో ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ .. అని ఈ పాట యూ ట్యూబ్ లో ఒక ట్రెండ్ ను సెట్ చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ పాట లిరిక్స్ చాలా బాగా ఉందనే చెప్పాలి మరి. అయితే ఈ పాటపై మరి కొంతమంది సమంత నిజ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలను ఆధారంగా చేసుకుని, ఈ పాట రాసినట్లు ఉందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాట లిరిక్స్ ని గనక మనం గమనించినట్లైతే మగాళ్ళ వంకరబుద్ధి గురించి బాగా వివరించినట్లు వెల్లడించారు. అంతేకాదు.. అమ్మాయిల విషయంలో వారి ఆలోచనా తీరు ఎలా ఉంటుందో సెటైరికల్ గా, ఫిలాసఫికల్ గా వెల్లడించారు.

ఇటీవల కాలంలో నాగచైతన్య నుండి సమంత విడిపోయిన తర్వాత బాగా మూడ్ ఆఫ్ అయ్యింది. ఇక ఆమె ఎంతో దుఃఖించింది.. ఈమె అమ్మ చెప్పింది అనే పేరుతో సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టి అందులో మగాళ్ళ ఆలోచనలను మహిళల పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేసింది ఈ భామ. అయితే ఈ పాటలో అంతా అనుకున్నట్టుగానే జరిగింది అని సమంత, నాగచైతన్య జీవితంలో జరిగినట్టుగా మగాళ్ళ వంకరబుద్ధిని ఉద్దేశిస్తూ లిరిక్స్ రాసినట్లు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: