ఇక పుష్ప లో కథ అంటూ పెద్దగా ఏమీ లేకుండా పోయింది. సినిమా ను ఎప్పుడు అయితే రెండు పార్టులుగా తీయాలని అనుకున్నాడో అప్పుడే ఫస్ట్ పార్ట్ లో కథ లేకుండా మొత్తం సాగదీసేసినట్టు ఉంది. అయితే రన్ టైం కూడా ఎక్కువ కావడం మైనస్. ఇక సినిమా ప్లస్ ల విషయానికి వస్తే అల్లు అర్జున్ నటన, బాడీ లాంగ్వేజ్, చిత్తూరు యాస బాగున్నాయి.
వీటితో పాటు ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ .. అక్కడ కామెడీ సీన్లు సూపర్బ్. ఇంటర్వెల్ సీన్ - ఇంటర్వెల్ తర్వాత వచ్చే మొదటి ఫైట్ - ఫహద్ ఎంట్రీ తర్వాత ఆఖరి 30 నిముషాలు సినిమా కు మంచి హైప్ ఇచ్చాయి. ఇక మైనస్ ల విషయానికి వస్తే స్లో నరేషన్ సినిమా చూస్తున్న వారిని బాగా ఇబ్బంది పెట్టింది.
ఇక మైనస్ ల విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరీ ఆశించి నంతగా లేదు. ఇక ఎడిటింగ్ చాలా మైనస్ అయ్యింది. రన్ టైం మరీ ఎక్కువుగా ఉందనిపిం చింది. ఇక సినిమా లో గ్లామర్ అన్నది లేదు. ఒక్క సమంత ఐటమ్ సాంగ్ తప్పితే గ్లామర్ లేదనే చెప్పాలి. ఇక సినిమాను సుక్కు బాగా సాగదీసి పడేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి