తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇక సినిమాల నుండి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీళ్లిద్దరి మధ్య చాలా వార్ నడిచింది. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి విడుదల చేసారు సూపర్ స్టార్ కృష్ణ. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో సూపర్ స్టార్ కృష్ణ తీసిన 'ఈనాడు' సినిమా ఎన్టీఆర్ పార్టీ విజయానికి ఒక రకంగా దోహదపడిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీనియర్ ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ సినిమాలు తీశారు కృష్ణ.

అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ.. రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ సింహాసనం, మండలాధీశుడు, నా పిలుపే ప్రభంజనం, గండిపేట రహస్యం, సాహసమే నా ఊపిరి వంటి సినిమాలు తీశాడు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ తరచూ వాడే కొన్ని ఊత పదాలను యధాతధంగా వాడుతూ తీసిన ఈ సినిమాల్లో 'సింహాసనం' అనే సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం. ఇక మిగతా వాటిలో కొన్ని సినిమాలు విజయనిర్మల డైరెక్ట్ చేయడం జరిగింది. 

మరోవైపు మండలాధీశుడు అనే సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గెస్ట్ గా చేసి.. ఆ తర్వాత వేరే వాళ్ళతో నటింపజేసి స్వయంగా ఈ సినిమాను తానే తీయడం మరో విశేషం. మొత్తంమీద అప్పటి కాలంలో ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరి మధ్య వార్ గట్టిగానే నడిచింది. అయితే వీరిద్దరి తరాల వారసులుగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అగ్ర హీరోల కొనసాగుతున్నారు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటేన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: