ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తీసిన లేటెస్ట్ హిట్ మూవీ పుష్ప ది రైజ్. పాన్ ఇండియా సినిమాగా రెండు భాగాలుగా దీనిని మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా ఇటీవల రిలీజ్ అయిన పార్ట్ 1 మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మాస్ ఎంటర్టైనర్ మూవీలో రష్మిక మందన్న హెరాయిన్ గా నటించగా క్యూబా ఫోటోగ్రఫి అందించారు.
మాస్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పుష్ప లో అల్లుఅర్జున్ అద్భుత పెర్ఫార్మన్స్ మెయిన్ హెలైట్ గా నిలిచింది. ఇప్పటికే తమ సినిమా చాలా ప్రాంతాల్లో మంచి వసూళ్లు అందుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో మరింతగా కలెక్షన్స్ రాబడుతుందని, అలానే ఓవరాల్ గా పుష్ప రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్ అందుకునే అవకాశం ఉందని మొన్న పుష్ప మూవీ థాంక్యూ మీట్ లో భాగంగా నిర్మాతల్లో ఒకరైన నవీన్ మాట్లాడుతూ చెప్పారు. ఇక పుష్ప మొదటి భాగం ఎంతో నచ్చిన ఆడియన్స్ రెండవ పార్ట్ అయిన పుష్ప ది రూల్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఇక పార్ట్ 1 లో చూపిన విధంగా మంగళం శ్రీను భార్యగా దాక్షాయణి పాత్రలో కనిపించిన అనసూయ, అలానే మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ పోషించిన భన్వర్ సింగ్ షకావత్ అనే పోలీస్ అధికారి పాత్ర, ఇవి రెండూ కూడా పార్ట్ 2 లో మెయిన్ విలన్స్ గా కనిపించనున్నాయనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అలానే ఇటీవల పలు మీడియా ఛానెల్స్ లో పుష్ప గురించి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తాము పార్ట్ 1లో చూపించింది కొంత మాత్రమే అని, అసలు సినిమా మొత్తం పార్ట్ 2 లోనే ఉందని, తప్పకుండా రిలీజ్ తరువాత పార్ట్ 1 ని మించేలా పార్ట్ 2 మరింత అద్భుత విజయం సాధించడం ఖాయం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: