ఇక ఒక పెద్ద సంఘటన జరిగింది అంటే దాని ప్రభావం ఇండస్ట్రీపై ఉంటుందని సూపర్ స్టార్ కృష్ణ గారు ప్రవచించినట్టు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ సెడెన్ గా వాయిదా పడడంతో అలాంటిదే ఏదో ఇప్పుడు జరుగుతోంది.ఇక ఈ సినిమా వాయిదా ప్రకటన తరువాత అనూహ్య పరిణామమిది. ఇంతలోనే చిన్నా చితకా సినిమాలన్నీ విడుదల తేదీల్ని లాక్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు థియేటర్ల కొట్లాటకు కూడా వీళ్లంతా ఢీ అనే పరిస్థితి నెలకొని ఉంది.ఆర్.ఆర్.ఆర్ - రాధేశ్యామ్ సినిమాలు మరోసారి పోస్ట్ పోన్ అవుతున్నాయి అని వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా చిన్న సినిమాలు సంక్రాంతి బాక్సాఫీస్ ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఐదారు సినిమాల రిలీజ్ తేదీల్ని టకటకా ప్రకటించేయడం హీట్ పెంచింది.

హీరో,రౌడీ బాయ్స్,డీజె టిల్లు,సూపర్ మచ్చి ఇంకా 7 డేస్ 6 నైట్స్  సినిమాలు జనవరి 7 వ తేదీ నుంచి 14 మధ్యలో విడుదల అవ్వనున్నాయి. అయితే ఇందులో చాలా సినిమాలు కూడా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంకా రెడీ అవ్వలేదు కానీ ఎలాగైనా విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు మిగతా వారందరి పై ప్రెజెర్ పెట్టి మరీ పనులు చేస్తున్నారని సమాచారం. మొత్తానికి టెక్నీషియన్లు సహా ఆర్టిస్టులు అన్ని సెక్షన్ల వారికి ఒక్కసారిగా పని అనేది తగిలినట్టయ్యింది. దీనివల్ల పెండింగ్ షూటింగ్స్ చకచకా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని పెండింగ్ పనులన్నీ వేగంగా ముగించి చాలా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ హడావుడి అంతా కూడా సంక్రాంతి అన్న మిషతోనే. ఏపీలో టికెట్ రేట్ల సమస్య పరిష్కారం కాకపోయినా సరే చిన్నా చితకా సినిమాలు ఎదురు చూసేందుకు సిద్ధంగా లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికి అరడజను సినిమాలు తెరపైకొచ్చేశాయ్.. ఇంకో అరడజను వరకూ సంక్రాంతి పండగకి విడుదల తేదీల్ని ప్రకటించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: