మెగా ఫ్యామిలీ నుంచి ఒక క్రికెట్ టీమ్ స్థాయిలో దాదాపు డజను మంది  హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వీరిమధ్య పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎవరికి వారు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి  చాల కష్ట పడుతున్నారు. అంతేకాదు  ఒకరికొకరు సపోర్టుగా నిలుస్తూ ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నారు.


ఈ పోటీ మధ్య  మెగా ట్యాగ్ తో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంటర్ అయినప్పటికీ ఇంకా రాణించా లేకపోతున్నాడు.   మొదట్లో ఈ మెగా అల్లుడు నటించిన  ‘విజేత’  మూవీకి మెగా ఫ్యామిలీ హీరోలు అంత మద్దతు ఇచ్చారు. అయితే ఎంత ప్రమోట్ చేసినా ఆమూవీ సక్సస్ కాలేదు. దీనితో షాక్ అయిన కళ్యాణ్ దేవ్ కొంత  గ్యాప్ తీసుకుని   ‘సూపర్ మచ్చి’ మూవీని పూర్తిచేసి సంక్రాంతి సినిమాల రేస్ లో నిలబెట్టాడు.  ఈ మూవీలో  కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈమూవీ పండుగ సీజన్ లో రిలీజ్  అయిన విషయాన్ని మెగా ఫ్యాన్స్ ఎవరు పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి విడుదల అయిన సినిమాలు ప్రచారంలో హోరు ఎత్తిస్తే సందర్భంగా విడుదలవుతున్న మిగతా మూడు సినిమాల మధ్య ‘సూపర్ మచ్చి’ సినిమా మాత్రం  సౌండ్ లేకుండా ఉండి పోయింది.


ఈ మూవీకి కనీసపు కలెక్షన్స్ కూడ రాలేదని వార్తలు వస్తున్నాయి. కనీసం ఈసినిమా వార్తలు కూడ ఎక్కడా వినబడకపోవడం సినీ అభిమానులను ఆశ్చర్య పరిచింది. ‘విజేత’ చిత్రాన్ని ప్రమోట్ చేసిన మెగా హీరోలు కళ్యాణ్ రెండో సినిమాను పట్టించుకోలేదు. మరోవైపు ‘హీరో’ ‘రౌడీ బాయ్స్’ చిత్రాలకు మాత్రం మెగా హీరోలు తమ మద్దతు తెలిపి ‘సూపర్ మచ్చి’ ని మర్చిపోవడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ‘సూపర్ మచ్చి’ చిత్రంతో తెలుగులో రాణిద్దామనుకొని కోటి ఆశలతో కన్నడ నుంచి ఇక్కడకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రచిత రామ్ కి తీవ్ర నిరాశే ఎదురైందని వార్తలు వస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: