టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్. ఆర్ఆర్ఆర్ ని రాజమౌళి తీస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమాలో తొలిసారిగా కలిసి నటిస్తుండగా ప్రముఖ నిర్మాత దానయ్య ఈ మూవీని అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ గా పని చేయగా ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమురం భీం గా నటించారు.

మన దేశంతో పాటు పలు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా ఎంతో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ వాస్తవానికి ఈనెల 7న విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరుగుదల కారణంగా పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ సహా పలు ఇతర ఆంక్షలు విధించడంతో వాయిదా వేశారు. ఇక రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ రావడంతో పాటు అవి మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాని రాధాకృష్ణ కుమార్ తీయగా కృష్ణంరాజు ఇందులో కీలక పాత్ర చేసారు. వాస్తవానికి ఈనెల 14న రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్ కూడా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

అయితే విషయం ఏమిటంటే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మరొక రెండు నెలల్లో ఈ రెండు సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయని అంటున్నారు. ముందుగా రాధేశ్యామ్ మూవీ మార్చి 18న రిలీజ్ కానుండగా, సరిగ్గా వారం తరువాత అనగా 25న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్నట్లు టాక్. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులు కొన్నాళ్ల తరువాత అదుపులోకి వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈలోపు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తే బాగుంటుందని రెండు సినిమాల యూనిట్స్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టాక్. మరి ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం పక్కాగా బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాక్సాఫీస్ పోరు ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే ఈ సినిమాలకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: