కరోనా వల్ల థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. ఫస్ట్ వేవ్ తర్వాత కొన్నాళ్లు.. సెకండ్ వేవ్ తర్వాత మరికొన్నాళ్లు నడిపించిన థియేటర్లు ప్రస్తుతం థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తో కొన్నిచోట్ల మూసేశారు. మళ్లీ పాత రోజులు ఎప్పుడు వస్తాయో అని ఆడియెన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే థియేటర్లు ఉన్నా లేకున్నా పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్రో డాడీ సినిమా ఓటీటీ బాట పడుతుంది.

పృధ్విరాజ్ సుకుమారన్ డైరక్షన్ లో మోహన్ లాల్ నటించిన క్రేజీ మూవీ బ్రో డాడీ. అంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ సీరియస్ సబ్జెక్ట్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు పృధ్వి రాజ్, మోహన్ లాల్ కలిసి బ్రో డాడీ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో వస్తున్నారు. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మూవీ పై ఆసక్తి కలిగేలా చేసింది. మోహన్ లాల్ ఎనర్జీ బ్రో డాడీ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. సినిమాలో కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా నటిస్తుంది.

బ్రో డాడీ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోనీ పెరుంభవూర్ నిర్మించారు. సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలని అనుకున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కష్టమని భావించి ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 26న డిస్నీ హాట్ స్టార్ లో బ్రో డాడీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై మళయాళ ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీతో మరో హిట్ అన ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు మోహన్ లాల్. అక్కడ పృధ్విరాజ్ సుకుమారన్ కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: