యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో గతంలో జనతా గ్యారేజ్ సినిమా తీశారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్ర చేసిన ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ కొట్టింది. ఇక త్వరలో ఎన్టీఆర్, కొరటాల కలిసి మరొక సినిమాకి వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటించనుంది. మొన్న ఈ విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా స్వయంగా అలియా వెల్లడించారు. కాగా ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని, రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నట్లు టాక్.

ఎన్టీఆర్ కెరీర్ 30వ మూవీగా రూపొందనున్న దీనిని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ ల నిర్మించనున్నాయి. తాజా రాజకీయ అంశాలపై సాగే ఈ యాక్షన్ పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ ఒక స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నారని కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక సినిమా వాస్తవానికి నేడు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన ఓపెనింగ్ ని రేపటికి వాయిదా వేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

పలువురు అతిథుల సమక్షంలో ఈ వేడుక రేపు ఎంతో గ్రాండ్ గా జరుగనుందని, అయితే ముందుగానే సమాచారం ఇస్తే ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుందని భావించిన యూనిట్, ఈ వేడుక అనౌన్స్ మెంట్ ఇవ్వలేదని సమాచారం. మొత్తంగా అందరిలో ప్రారంభానికి ముందే ఎన్టీఆర్ 30వ సినిమా ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిందనే చెప్పాలి. మరి రెండోసారి ఎన్టీఆర్, కొరటాల జత కడుతున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే ఈ మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: