మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా పెట్టిన ఓ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఈ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందిన ఈ సినిమాని దేవకట్ట రూపొందించగా ఆ సమయం లో బైక్ యాక్సిడెంట్ గురి కావడం వల్ల ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేకపోయారు. అలా ఆ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాల గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. 

తొందర్లోనే ఆయన తదుపరి సినిమా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. యాక్సిడెంట్ దగ్గరనుంచి మీడియాకు దూరంగా ఉంటూ కనీసం కెమెరా ముందుకు కూడా రాని ఈ హీరో తాజాగా కనకదుర్గ టెంపుల్ ను దర్శించారు. ఆ తర్వాత మరెక్కడా కూడా కనిపించలేదు. అయితే మీ జీవితంలో అత్యుత్తమ స్క్రీన్ ప్లే దేవుడు ముందే రాశాడు. ఆయనను విశ్వసించే ముందుకు సాగండి. అని,  గాడ్స్  టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని రాసి ఉన్న ఓ ఫోటోను తన అభిమానులతో ఆయన పంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీనికి అర్థం ఏమిటో అనీ కొందరు ఆరా తీస్తుంటే భీమ్లా నాయక్ సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నారని ఆ సినిమా బ్లాక్బస్టర్ కు చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఆయన ఈ విధమైన కామెంట్లు చేశారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా విడుదల విషయంలో సందిగ్ధత నెలకొనడంతో 25వ తేదీన విడుదల కావడం హిట్ కావడం జరిగింది. అయితే ఇదే సమయంలో అధికార పార్టీ ఎన్నో ఇబ్బందులు గురిచేసింది. సాయి ధరమ్ తేజ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆసక్తికరంగా సోషల్ మీడియా  మారింది ఆ తర్వాత ఆయన ఓ సినిమా చేస్తున్నాడు సుకుమార్ తో పాటు ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. కార్తిక్ దండు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. 




 

మరింత సమాచారం తెలుసుకోండి: