ఇటీవల కాలంలో సినిమాల పంథా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నాలుగు ఫైట్లు మూడు పాటలు కొన్ని రొమాంటిక్ సీన్స్, మరి కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉంటే చాలు.. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనుకునేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం చిన్న హీరో అయిన పెద్ద హీరో అయిన కథ బలంగా ఉంటే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా సరే కథ బలంగా లేకపోతే ఇక ప్రేక్షకులకు నచ్చకపోతే డిజాస్టర్ గా నే  మిగిలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి సినిమాలో పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు భారీ తారాగణం ఉన్న  ఉపయోగం లేకుండా పోతుంది.


 ఈ విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో కూడా నిజం అయింది. అందుకే దర్శక నిర్మాతలు అందరూ కూడా సరికొత్త కథలనే తెరమీదకు తీసుకు వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులకు సరికొత్త విషయాలను తెలియజేస్తూ ఉన్నారు.  ఇక మరి కొంత మంది ప్రముఖుల జీవిత కథలనే సినిమాలుగా తెరకెక్కించి  ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి విషయాలను కూడా అందుకుంటున్నారు  అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన చిత్రం కాశ్మీర్ ఫైల్స్.


 వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారత్ గురించి ఎన్నో నిజాలు ఈ సినిమాలో చూపించబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.  ఇదే విషయంపై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచానికి నిజాలు చూపించాలని ఉద్దేశంతోనే కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీశాను అంటూ చెప్పుకొచ్చాడు. దేశానికి కీర్తిస్తూ దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే సినిమాలు చేయడానికి హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందాను అంటూ చెబుతున్నాడు. ఇక ఈ సినిమా కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీర్ హిందువుల వలస ఆధారంగా రూపొందింది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి..

మరింత సమాచారం తెలుసుకోండి: