టాలీవుడ్ అగ్ర కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం 'త్రిబుల్ ఆర్'. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. సుమారు 500కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా.. కీరవాణి సంగీతమందించారు. అయితే విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి కీరవాణి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో కీరవాణి అడిగిన పలు ప్రశ్నలకు రామ్ చరణ్, ఎన్టీఆర్ పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. అయితే తాను కంపోజ్ చేసిన ఒక చెత్త పాట గురించి వెల్లడించమని ఎన్టీఆర్ ని కీరవాణి కోరారు. ఇక దీనిపై స్పందించిన ఎన్టీఆర్..' ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడ అనే పాట తనకు అస్సలు నచ్చదు అని తెలిపాడు. ముఖ్యంగా లిరిక్స్ విషయంలోనూ ఏమో కానీ తనకి ఆ పాట అంటే నచ్చదు అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. కానీ ఈ పాట సూపర్ సక్సెస్ అయింది. ఇక రామ్ చరణ్ కూడా ఓ పాటని చెప్పేందుకు ట్రై చేశాడు. కానీ ఆ సినిమా గుర్తుకు రావడం లేదని అది చిన్న సినిమా అని 2021 లో రిలీజ్ అయింది అని తెలిపాడు.

అయితే ఘరానా బుల్లోడు సినిమాలోని భీమవరం బుల్లోడ అనే పాట ఎన్టీఆర్ కు అస్సలు నచ్చదు అని స్వయంగా చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఎన్టీఆర్ కి ఎందుకు నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం.. అటు రామ్ చరణ్ ఎన్టీఆర్ మొదటి సారి కలిసి ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు గా రామ్ చరణ్ కొమురం భీం గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: