నాగచైతన్య తో సమంత విడిపోయిన తరువాత ఆమె తన కెరియర్ పై మరింత సీరియస్ గా దృష్టిపెట్టి మరిన్ని సినిమాలు చేసి తన టాప్ టాప్ హీరోయిన్ స్థానాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకు పరిస్థితులు అనుకూలించాడంలేదు. గతంలో ఆమెతో నటించిన టాప్ హీరోలు ఎవరు ఆమెకు తమ సినిమాలలో అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు.
దీనితో ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల పై దృష్టిపెట్టి తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ మూవీ విడుదలకు రెడీగా ఉన్నప్పటికీ ఆమెకు తగ్గిన క్రేజ్ రీత్యా ఆమూవీ మార్కెట్ లో కొన్ని సమస్యలు ఏర్పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీతో పాటు సమంత ‘యశోద’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తోంది.
అయితే సమంత దృష్టి మాత్రం కమర్షియల్ సినిమాల పై ఉంది. టాప్ కమర్షియల్ హీరోలు అంతా రష్మిక పూజా హెగ్డేల వైపు దృష్టి పెట్టడంతో సమంతకు అవకాశాలు రావడంలేదు. రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసే విజయ్ దేవరకొండ సమంత తో కలిసి నటించడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించే మూవీలో సమంత హీరోయిన్ గా ఎంపిక అయింది అంటూ వార్తలు వస్తున్నాయి.
గతంలో ‘మజిలి’ మూవీలో శివనిర్వాణ దర్శకత్వంలో సమంత నటించింది. ఇప్పుడు ఆపరిచయంతోనే మళ్ళీ సమంత ఈ మూవీ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నట్లు టాక్. ఈ మూవీ కథ అంతా కాశ్మీర్ చుట్టూ తిరుగుతుంది అని అంటున్నారు. గతంలో మణిరత్నం రోజ సినిమాను కాశ్మీర్ నేపధ్యంలో తీసాడు. ఇప్పుడు మళ్ళీ శివ నిర్వాణ అదే కాశ్మీర్ నేపద్యంలో ఉండే లవ్ స్టోరీని ఎంచుకున్నాడు అని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి