అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం నటుల పట్ల అస్సలు జాలి, దయ చూపడు చాలా కర్కశంగా ప్రవర్తిస్తాడని తారక్ అన్నారు. ఆయనకు అనుకున్న సీన్ రావాలి అంతే అందులో ఇంచు తక్కువైన అస్సలు కాంప్రమైజ్ కారు.. rrr సినిమాలో పులి ఫైటింగ్ సీన్ కోసం తనని ఒక జంతువులా వేటాడాడని పరుగులు పెట్టించారు అని అన్నారు.
బల్గేరియా అడవుల్లో ఆ సీన్ చేస్తున్నప్పుడు పులికంటే వేగంగా పరిగెత్తాలి అని చెబుతూ రన్.. రన్ ...రన్ అంటూ గంభీరంగా అరిచేవాడని అన్నారు తారక్. ఇంటర్వల్ సీన్ కొరకు 65 రాత్రులు నిరంకుశంగా కష్టపడ్డామని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా జక్కన్న మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కారని అనుకున్న సీన్ వచ్చే వరకు నిద్రపోడని,మమ్మల్ని పోనివ్వడని సరదాగా షూటింగ్ విషయాలను పంచుకున్నారు ఎన్టీఆర్. అభిమానులు ఎం కోరుకుంటున్నారో రాజమౌళి కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అంటూ జక్కన్న పై ప్రశంసలు కురిపించారు తారక్. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లను సాధిస్తూ దూసుకు వెళుతోంది. ఇదే విధంగా కొనసాగితే అన్ని రికార్డులు బద్దలవడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి