తమన్నా : అందాల ముద్దుగుమ్మ తమన్నా ఇప్పటి వరకు అనేక ఐటమ్ సాంగ్ లలో కనిపించి ఐటమ్ సాంగ్ లలో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. తమన్నా ఇప్పటి వరకు అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ , కే జి ఎఫ్ చాప్టర్ 1 , గని ఈ సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
పూజా హెగ్డే : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే , రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించే తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది.
సమంత : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సమంత వరస సినిమాలతో బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన సమంత పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి