ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని మరియు మలయాళ నటి నజ్రియా ఫాజిల్ కలిసి నటిస్తున్న చిత్రం 'అంటే సుందరానికీ!'. అయితే ఈ మూవీని జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఇకపోతే తాజాగా ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది.ఇకపోతే  ఇప్పటికే సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్.. ఇక ఇప్పుడు మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.అయితే 'అంటే సుందరానికీ!' మూవీ టీజర్ ను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

ఇకపోతే అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్లు నాని, నజ్రియా డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.ఇదిలావుండగా  ఇటీవలే నాని పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. కాగా దానికి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది.అయితే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని, మలయాళ నటి నజ్రియా ఫాజిల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ యర్నేనేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఇకపోతే వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

ఇక జూన్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది₹ ఇక ప్రస్తుతం నాని 'దసరా' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు₹ ఈ సినిమా కోసం నాని తన లుక్ మొత్తాన్ని మార్చేసాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోదావరిఖనిలో జరుగుతోంది. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో నాని కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: