ఈ అమ్మడు నటన ,అందం, అభినయం ముఖ్యంగా తన జీరో సైజ్ బాడీ తో కుర్రకారులను బాగానే ఆకట్టుకుంది. కానీ తెలుగు లో వరుసగా అవకాశాలు బాగా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్ వైపు తన మనసు మళ్లింది. తెలుగు ఇండస్ట్రీ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ అయిన ఈమె కెరీర్ పరంగా చాలా ఇబ్బందుల్లో పడింది.. ఆమె చేతులారా తన కెరీర్ ను నాశనం చేసుకుంది.అయితే తాజాగా నటి ఇలియానా గురించి పలు వార్తలు సోషల్ మీడియా బాగా వినిపిస్తున్నాయి.. ఆ వార్తలు ఏమిటంటే.. ఇలియానా తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్లి న తరువాత ఈ అమ్మడు ఒకటి రెండు చిత్రాలలో కథానాయకిగా నటించినప్పటికీ ఈ చిత్రాలతో పెద్దగా గుర్తింపు సంపాదించలేకపోయింది. అంతేకాకుండా దీనికితోడు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ఇలియానాకు అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఖాళీగా ఉన్న సమయం లో మద్యానికీ బానిస అయినట్లుగా కొన్ని వార్తలు వినిపించాయి. తన సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్త తో ఒక్కసారిగా ఇలియానా అభిమానులు అవాక్కయ్యారు. ఈ మాటల ద్వారా ఈ అమ్మడు మద్యానీకి బానిసైంది అనే వార్తలను కొంతమంది ఖండిస్తున్నారు. మరికొంతమంది ఇది నిజమే అని అంటున్నారు.