ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల ద్వారా హీరోగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట తో కూడా మరొక సూపర్ హిట్ కొట్టేలా సినిమాని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ తో పాటు మొన్న విడుదలైన థియేటరికల్ ట్రైలర్ సహా అన్ని కూడా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో అలరించి సినిమాపై అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.

ఈ సినిమాని పరశురామ్ పెట్ల తీస్తుండగా కీర్తి సురేష్ ఫస్ట్ టైం మహేష్ బాబుకి జోడీగా నటిస్తోంది. థమన్ అందించిన సాంగ్స్ కూడా ఇప్పటికే మంచి పాపులర్ అవడంతో పాటు సినిమాలో థమన్ బీజీఎమ్ కూడా అదరగొట్టారని ఇన్నర్ వర్గాల న్యూస్. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలు కలిసి ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి మది కెమెరా మ్యాన్ గా వ్యవహరించారు. మే 12న సర్కారు వారి పాట మూవీ రిలీజ్ కానుండగా దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు మహేష్.

మూవీ జులై లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. ఈ మూవీ వరుసగా ఏ మాత్రం ఖాళీ లేకుండా షెడ్యూల్స్ జరగనున్నాయని, ఆపైన వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రాజమౌళితో మహేష్ మూవీ ప్రారంభం అవుతుందని టాక్. ప్రస్తుతం మహేష్ బాబు మూవీ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక స్టోరీ పై కసరత్తు చేస్తున్నారని మరికొన్ని నెలల్లో ఈ మూవీపై అధికారికంగా ప్రకటన రానుందని అంటున్నారు. మొత్తంగా దీనిని బట్టి ఇకపై రాబోయే రోజుల్లో మహేష్ బాబు డైరీ ఫుల్ బిజీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: