తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ హీరో గా పేరు పొందిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ చిత్రంలో నటించి ఆ సినిమాని పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్గా అనన్య పాండే నటిస్తున్నది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది. అందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా శరవేగంగా జరుపుకుంటున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ చిత్రం విడుదలైన తరువాత మరి కొద్ది రోజుల గ్యాప్ తో డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లోనే జనగణమన అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డైరెక్టర్ శివ నిర్వాణ తో కలసి ఒక లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నారు ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇలా ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు ఈ హీరో.

ఎప్పటికప్పుడు తన సరికొత్త అప్డేట్లను పోస్ట్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాడు విజయ్. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ని కూడా షేర్ చేయడం జరిగింది. ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక బోటులో ప్రయాణిస్తున్న విజయ్ నీటి వైపు చూస్తూ ఆ ప్రదేశాన్ని ఎంతో ఆస్వాదిస్తున్న టు గా కనిపిస్తుంది. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ తన కెరియర్లోనే లైగర్ అత్యంత పెద్ద సినిమా లైగర్ అని తెలియజేశాడు. అలాగే ఒక అందమైన ప్రేమ కథ చిత్రం అంటూ V11 క్యాప్షన్ ని కూడా పెట్టారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ విజయ్ దేవరకొండ సినిమా హైప్ చేశాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: