పవన్ రాజకీయ వ్యూహాలే కాదు ఒప్పుకున్న సినిమా షెడ్యూల్స్ వ్యవహారాలు తలలు పండిన వారికి కూడ అర్థం కావడంలేదు. రాబోతున్న ఎన్నికలలో పవన్ తెలుగు రాష్ట్రాలు రెండింటిలోను పోటీ చేస్తాను అని ఓపెన్ గా చెపుతున్న పరిస్థితులలో పవన్ ఎవరికీ మిత్రుడు మరెవ్వరికి శతృవు అన్న విషయం తలలు పండిన రాజకీయవేత్తకు కూడ అర్థం కావడం లేదు.



ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటూ తన రాజకీయ వ్యవహారాలను చక్కపెడుతున్న పవన్ హరీష్ శంకర్ కు మేలుచేసే ఒక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ నటించబోయే ‘భవధీయుడు భగత్ సింగ్’ మూవీ షూటింగ్ ను ఆగష్టు నుండి ప్రారంభించుకోమని హరీష్ శంకర్ కు పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.




వచ్చే సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఎన్నికల సమయానికి ముందు ‘భవధీయుడు భగత్ సింగ్’ ను విడుదలచేయాలి అన్న మాష్టర్ ప్లాన్ లో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో పవన్ లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. నేటి రాజకీయ వ్యవస్థను పరోక్షంగా టార్గెట్ చేసే పవర్ ఫుల్ పాత్రగా కనిపించ బోతున్నాడు.


ఇప్పటికే ఈసినిమా కోసం తూటాలు లాంటి డైలాగ్స్ ను వ్రాసుకుని హరీష్ శంకర్ రెడీగా ఉన్నాడు. పూజా హెగ్డే కూడ లెక్చరర్ పాత్రలో నటిస్తూ పవన్ ను ఆరాధించే ప్రేయసి గా కనిపిస్తుందట. ఈమూలోని పాటలు కూడ ఉద్వేగభరితంగా ఉండే విధంగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేయించినట్లు టాక్. ఈమూవీలో కీలకమైన ఒక అతిధి పాత్రను రామ్ చరణ్ తో చేయించే ఆలోచన ఉందట. పవన్ భావజాలానికి అనుగుణంగా ఈమూలో పవర్ స్టార్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ లో ‘హరి హర వీర మల్లు’ నిలబడితే వచ్చే సంవత్సరం ఎన్నికల ముందు ‘భవదీయు భగత్ సింగ్ విడుదల అయ్యే ఆస్కారం ఉంది..




మరింత సమాచారం తెలుసుకోండి: