కంగనా రనౌత్.. ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. ఇకపోతే ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది.అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో కూడా ఈమె సుపరిచితమే.అంతేకాకుండా టాప్ హీరోలను అయినా సరే ముచ్చెమటలు పట్టించగల సత్తా ఉంది. ఇకపోతే ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వరుస హిట్స్ కొట్టి టాప్ హీరోయిన్ గా కొనగడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. కాగా ఈమెకు వరుస పరాజయాలు ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

 అయితే ఇటీవల కాలంలో ఈమె చేసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.ఇదిలావుండగా తాజాగా ఈ బ్యూటీ నటించిన ధాకడ్ పెద్ద ప్లాప్ ను మూటగట్టుకుంది. అయితే జీరో ఆడియెన్స్ కారణంగా థియేటర్స్ లో ఈ సినిమాను తీసేస్తున్నారు.ఇక  మొదటి మూడు రోజులు అతిదారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం నుండి అయితే చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ సినిమా తొలి వెకెండ్ లో కేవలం కోటిన్నర మాత్రమే రాబట్టింది. ఇకపోతే శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ఏ మాత్రం రాబట్టలేక పోయింది.అయితే ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ 3 కోట్ల రూపాయలు మాత్రమే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

అంఅంతేకాదు  థియేటర్ లో పరిస్థితి ఇలా ఉంటే ఇక ఓటిటి దగ్గర కూడా ఈ సినిమాకు పరాభవం తప్పలేదు. అయితే శాటిలైట్, డిజిటల్ అమ్మకం ద్వారా కూడా ధాకడ్ జీరో ఆదాయం అని తెలుస్తుంది.ఇక  ఈ సినిమా నిర్మాతలు రిలీజ్ కు ముందు భారీ ఆఫర్స్ వచ్చినా ఇంకా పెద్ద మొత్తం వస్తాయని ఆశించి అమ్మలేదు.ఇక దీంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత ఘోర పరాజయం పొందడంతో ఇప్పుడు ఓటిటి వాళ్ళు కూడా ఈ సినిమాను పట్టించు కోవడం లేదు. అయితే  ఈ సినిమాను 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తే నిర్మాతలకు కేవలం 3 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: