టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ హీరో నటించిన గత చిత్రం కిలాడి ఆశించిన విజయాన్ని అందుకోవడంతో ఈసారి వచ్చే సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకోవాలని చాలా కసితో ఉన్నాడు రవితేజ. త్వరలో ఈయన నటించిన రామారావు అన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్,రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచారచిత్రాలు, టీజర్, పాటలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాక సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. 

నిజానికి ఈ సినిమాని జనవరి నెలలోనే దర్శకనిర్మాతలు విడుదల చేయాలనుకున్నారు  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో అనుకున్నారు. ఆ తేదీకి కూడా సినిమా విడుదల కాలేదు. ఇక జూన్ 17న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ తేదీకి కూడా సినిమాని విడుదల చేయలేక పోతున్నామని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమాలో రవితేజ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీల రవితేజతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఫారియా అబ్దుల్లా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు నుంచి కూడా ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా మరో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా రవితేజకు సోదరి పాత్రలో కనిపించనుందట. ఇప్పటికే కీర్తి సురేష్ లాంటి స్టార్ హీరోయిన్లు సైతం సీనియర్ హీరోలకు చెల్లిగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు యంగ్ బ్యూటీ ఫారియా అబ్దుల్లా కూడా చేరింది. త్వరలోనే చిత్రాన్ని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి పోతున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: