కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా వంద కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడం అంటే చాలా గొప్ప విషయం. స్టార్ హీరోలు నటించిన మూవీ లకు , అది కూడా భారీ బ్లాక్ బస్టర్ టాక్  బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ కి వచ్చినట్లయితే లాంగ్ రన్ లో వంద కోట్ల కలెక్షన్ లను సినిమాలు చేస్తూ ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. టికెట్ రేట్లు పెరగడం , సినిమాలను ఎక్కువ థియేటర్ లలో విడుదల చేయడం,  ప్రీమియర్ షో లు అంటూ ప్రత్యేకమైన షో లను వేయడం,  ఇలా అనేక కారణాల వల్ల సినిమాలకు అతి తక్కువ రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు వచ్చి పడుతున్నాయి. అందులో భాగంగా 2022 వ సంవత్సరంలో కూడా కొన్ని తెలుగు సినిమాలు ఇప్పటికే వంద కోట్ల మార్క్ ను టచ్ చేస్తాయి. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ అవలీలగా వంద కోట్ల మార్క్  ను టచ్ చేసింది. ఈ సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 11 వందల కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించింది.


రాధే శ్యామ్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్ లను అవలీలగా బాక్స్ ఆఫీస్  దగ్గర సాధించింది.


సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా 100 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: