నాచురల్ స్టార్ నాని ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన అంటే సుందరానికి సినిమాతో హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఓవైపు హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమౌతుంది.కానీ హీరో నేచురల్ స్టార్ నాని మాత్రం కనీసం మూడు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నాడు. అయితే గతంలో నాని 'ఎవడే సుబ్రమణ్యం' నుంచి సుడి తిరగడంతో, వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.ఇదిలావుంటే ప్రస్తుతం ఇప్పుడు నాని  పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నేచురల్ స్టార్.. 

లేటెస్ట్‌గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం వినబడుతుంది. ఇకపోతే ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడటని తెలుస్తోంది.ఇదిలావుంటే గతం లో ఆల్రెడీ నానిమారుతి కాంబోలో 'భలే భలే మగాడివోయ్' సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే  2015లో వచ్చిన ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఇకపోతే  ఈ సినిమాతోనే నానికి మరింత పాపులారిటీ వచ్చిపడిందని చెప్పుకోవడంలో సందేహం లేదు.

అయితే  తనకు ఇలాంటి మంచి హిట్ ఇచ్చినందుకే, మారుతితో కలిసి మరో ప్రాజెక్ట్ చేసేందుకు నాని సిద్ధమయ్యాడని తెలుస్తోంది.ఇదిలావుంటే  రీసెంట్‌గానే వీరి మధ్య కథా చర్చలు జరిగాయని, స్టోరీ బాగుండడంతో నాని పచ్చజెండా ఊపేశాడని సమాచారం వినిపిస్తోంది. ఇక ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పనులు సైతం జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.అంతేకాక నిజానికి.. మారుతి తన తదుపరి సినిమా ప్రభాస్‌తో చేయాల్సింది. ఇక అతడు 'సలార్'తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే ముఖ్యంగా.. సలార్ మీదే ఎక్కువ దృష్టి సారించాడు. కాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అవ్వడానికి అతనికి చాలా సమయమే పడుతుంది. ఇక అందుకే, ఈ గ్యాప్‌లో నానితో ఓ సినిమా చేయాలని మారుతి నిర్ణయించుకున్నాడని తెలిసింది. ఇకపోతే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: