నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత అంటే సుందరానికి మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా జూన్ 10 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సెకండ్ హాఫ్ స్పీడ్ స్క్రీన్ ప్లే తో బాగున్నప్పటికీ,  ఫస్టాఫ్ మాత్రం కాస్త స్లో అయింది అని నెగిటివ్ టాక్ వచ్చింది.

ఇలా విడుదల అయిన మొదటి షో కే ఈ సినిమాకు కాస్త నెగటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ లు కూడా రోజు రోజుకూ తగ్గుతూ వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు 13 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న అంటే సుందరానికి మూవీ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 6.13 కోట్లు , సీడెడ్ : 1.26 కోట్లు , యూ ఎ : 1.69 కోట్లు , ఈస్ట్ : 1.03 కోట్లు , వెస్ట్ : 84 లక్షలు , గుంటూర్ : 94 లక్షలు , కృష్ణ : 96 లక్షలు , నెల్లూర్ : 61 లక్షలు .
13 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలు అంటే సుందరానికి మూవీ 13.46 కోట్ల షేర్ , (22.75 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1.60 కోట్లు .
ఓవర్ సీస్ లో : 5.65 కోట్లు .
ప్రపంచవ్యాప్తంగా 13 రోజులకు గాను అంటే సుందరానికి మూవీ 20.71 కోట్ల షేర్ , 36.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.
ఈ మూవీలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం  వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: