వరలక్ష్మి శరత్ కుమార్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో అనేక సినిమాల్లో నటించినప్పటికీ మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో అదిరిపోయే గుర్తింపును సంపాదించుకుంది.  

క్రాక్ సినిమాలో జయమ్మ అనే పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్రతో అదిరిపోయే విలనిజాన్ని అద్భుతంగా పండించి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అదిరిపోయే ప్రశంసలను అందుకుంది. జయమ్మ పాత్రతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యశోద సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అని, అలాగే ఈ పాత్ర యశోద సినిమాకి హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా యశోద సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది.

ఈ విషయాన్ని తెలియ జేస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో ని పోస్ట్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వీడియోలో యశోద చిత్ర బృందానికి చాలా థ్యాంక్స్,  ఈ సినిమాలో నాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. మీ అందరితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. యశోద సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు చిత్ర బృందానికి  కృతజ్ఞతలు. ఈ మూవీ ని వెండి తెరపై చూడడానికి చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాను అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: