అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . మలయాళం సినిమా ప్రేమమ్ తో కెరీర్ ని మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా తోనే మలయాళ ఇండస్ట్రీలో అదిరిపోయే విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఫుల్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది . 

ప్రేమమ్ మూవీతో మలయాళం ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది . అందులో భాగంగా ఇప్పటి వరకు అనేక తెలుగు సినిమాలలో నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర అనేక విజయాలను అందుకని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. కొంత కాలం క్రితమే అనుపమా పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ ముద్దు గుమ్మ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తోంది. 

అందులో భాగంగా తాజాగా అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమాలో హీరోయిన్ నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను  జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ఫోటోను కూడా పోస్ట్ చేసింది. ఇలా అనుపమ పరమేశ్వరన్ కార్తికేయ 2 సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తిచేసినట్లు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: