యంగ్ హీరో య‌ష్, స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా కేజీఎఫ్‌. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన నటీనటులు కూడా స్టార్స్ రేంజ్ ను అందుకున్నారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రికి మంచి క్రేజ్ ద‌క్కింది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలో అండ్రూ క్యారెక్టర్‌లో అభిమానులను అలరించాడు బీఎస్ అవినాష్. అయితే ఇప్పుడు తాజాగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. అంతేకాదు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడి చేశారు.

కాగా గత నెల జూన్ 29 ఉదయం 6:05 గంటలకు నేను జీవిత కాలానికి సరిపడా భయం చూశాను. క్షణకాలం లో అనుకోకుండా ప్రమాదం జరిగింది. అది నేను జిమ్ నుంచి కారు నడుపుకుంటూ వెళుతుండగా.. అనిల్ కుంబ్లే ఇంటి దగ్గర గ్రీన్ లైట్ సిగ్నల్ పడగా...... ఎదురుగా వస్తున్న కంటైనర్‌ రెడ్ సిగ్నల్‌ను క్రాస్ చేసి వేగంగా వచ్చేసి నా కారును ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ నాకేమి కాలేదు. నా అభిమానుల ప్రేమకు నేను చాలా కృతజ్ఞతుడిని. అందుకే నాకు ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే నా కారు మాత్రము బాగా డ్యామేజ్ అయింది. ఈ సమయంలో నాకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చాలా థ్యాంక్స్. అలాగే ఆ ట్రక్ డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశా. అంతేకాక అభిమానులు నా పట్ల చూపిస్తోన్న ప్రేమ నాకు చాలా అనుభూతిని ఇస్తుంది. దానికి నేను చాలా అదృష్టవంతుడిని. అభిమానులందరికి నా ధన్యవాదాలు..’ అంటూ కేజీఎఫ్ విలన్ రాసుకొచ్చాడు.

కాగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్‌లో, అవినాష్ ఒక గ్యాంగ్‌ కు బాస్ అయిన ఆండ్రూ అనే పాత్రను పోషించి.... కేజీఎఫ్ రెండు భాగాల్లోనూ కీలక పాత్రను వ్యవహరించారు. అయితే దివంగత నటుడు చిరంజీవి సర్జా ద్వారా అవినాష్‌కి ఈ కేజీఎఫ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కాగా సర్జా స్నేహితుడి ద్వారా, అవినాష్ కు సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడతో పరిచయం ఏర్పడటం తరువాత భువన్ గౌడ అతనిని ప్రశాంత్ నీల్‌కు పరిచయం చేయడంతో అయన ఈ సినిమాలో నటించడం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: